Sapta Sagaradaache Ello | ఆసక్తి రేపుతున్న రక్షిత్ శెట్టి ‘సప్త సాగరే దాచే ఎల్లో’ ట్రైలర్
Sapta Sagaradaache Ello (Side A) | కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty). ఇక రక్షిత్ శెట్టి తాజాగా నటిస్తున్న చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో (సైడ్ ఏ). ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు ఆకట్టుకోగా తాజాగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
Sapta Sagaradaache Ello (Side A) | కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రక్షిత్ శెట్టి (Rakshit Shetty). కిరిక్ పార్టీ (Kirik Party), అతడే శ్రీమన్నారాయణ (Avane Srimannarayana), చార్లీ 777 (Charlie 777), గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) వంటి చిత్రాలతో పాన్ ఇండియా(Pan India) లెవల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక చార్లీ 777, అతడే శ్రీమన్నారాయణ చిత్రాలతో తెలుగులో కూడా మంచి పేరు సంపాదించాడు రక్షిత్ శెట్టి. రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నాడు. ప్రతి సినిమాలోనూ కొత్తదనాన్ని ప్రయత్నిస్తాడు. ఆయన డైరెక్షన్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక రక్షిత్ శెట్టి తాజాగా నటిస్తున్న చిత్రం ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ) Sapta Sagaradaache Ello (Side A). రుక్మిణి (Rukmini) కథానాయికగా నటిస్తుంది.
గోధి బన్న సాధారణ మైకట్టు(Godhi Banna sadharana Maikattu), కవలుదారి Kavaludhari (తెలుగులో కపటధారి), భీమ సేన నల మహారాజు (Bheema Sena Nala Maharaju) లాంటి బ్లక్ బస్టర్లు తీసిన దర్శకుడు హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్లు ఆకట్టుకోగా తాజాగా ఈ మూవీ నుంచి చిత్రబృందం ట్రైలర్(Trailer)ను విడుదల చేసింది. ట్రైలర్ గమనిస్తే రొమాంటిక్ అండ్ లవ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ) గా.. రెండో పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ బీ) గా రానుంది. ఇక హేమంత్ రాజ్, రక్షిత్ శెట్టి కాంబోలో ఇంతకుముందు గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కన్నడలో బ్లక్ బస్టర్‌గా నిలిచింది. కాగా సుమారు 8 ఏండ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సప్త సాగరే దాచే ఎల్లోపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
రక్షిత్ శెట్టి సొంత ప్రొడక్షన్స్ అయిన పరమవా స్టూడియోస్ (Paramvah Studios) బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వసంత్, చైత్ర జె ఆచార్, అచ్యుత్ కుమార్, శరత్ లోహితాశ్వ, పవిత్ర లోకేష్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. చరణ్ రాజ్ సంగీతం అందించనున్నారు.
ఇక ఇదే కాకుండా రక్షిత్ శెట్టి సొంత డైరెక్షన్లో ‘రిచర్డ్ ఆంటోనీ’(Richard Antony) అనే సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని కేజీఎఫ్, కాంతారలాంటి సినిమాలను నిర్మించిన ‘హోంబాలే ఫిల్మ్స్'(Hombale Films) సంస్థ నిర్మిస్తుంది.
ಮನು ಮತ್ತು ಪ್ರಿಯಾಳ ಪ್ರಪಂಚದ ಸಣ್ಣ ಪರಿಚಯ ನಿಮ್ಮ ಮುಂದೆ. ಪ್ರೀತಿಯಿರಲಿ 🤍
A beautiful strain of love runs through length of this story! Today, as we share a part of Manu and Priya’s world with you, I hope you get a glimpse of the intensity and the beauty that lies in their love and I… pic.twitter.com/0yzbxyZQKd
— Rakshit Shetty (@rakshitshetty) August 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

