Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రబృందం.
ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ను వెల్లడించింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు (Godari Gattu) అనే పాటను డిసెంబర్ 03న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వెంకటేశ్‌తో పాటు ఐశ్వర్య రాజేష్ ఉన్న పోస్టర్‌ను పంచుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే వెంకీ మామ చాలా రోజుల తర్వాత తన పాత స్టైల్లో సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పాటను టాలీవుడ్ సింగర్, సీనియర్ సంగీత దర్శకుడు రమణ గోగుల పాడినట్లు సమాచారం. లక్ష్మీ సినిమా అనంతరం 18 ఏండ్ల తర్వాత వెంకటేశ్ కోసం పాట పాడబోతున్నాడు రమణ గోగుల.
The Musical magic of #SankranthikiVasthunam begins with a chartbuster tune that will stay in your hearts & playlist for a long time 🫶🫶🫶
First Single #GodariGattu Lyrical Video out on December 3rd ❤️🔥
A #BheemsCeciroleo Musical 🎶
Lyrics by @bhaskarabhatla
Sung by… pic.twitter.com/ygxqGccyLH— Sri Venkateswara Creations (@SVC_official) November 27, 2024