Leo Movie | విజయ్-లోకేష్ కాంబోలో తెరకెక్కుతున్న లియోపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. పైగా ఇటీవలే రిలీజైన టీజర్ సినిమాకు కావాలిసినంత బజ్ తెచ్చిపెట్టింది. విక్రమ్ తర్వాత లోకేష్ నుండి వస్తున్న సినిమా కావడం, ఎల్సీయూలో భాగంగానే ఈ సినిమా తెరకెక్కడం వంటివి మరింత వీర లెవల్లో అంచనాలు నమోదయ్యాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెట్లోకి సంజయ్ దత్ అడుగుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
లియో సినిమాలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇదివరకు రిలీజైన ఆయన లుక్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సంజయ్‌దత్ రోల్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించనుందని గతంలో లోకేష్ తెలిపాడు. ఇక మాస్టర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగానే అంచనాలున్నాయి. త్రిష హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సెవన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్.లలిత్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.
Sanjay Dutt joins #Leo. pic.twitter.com/CihMEG0u9Q
— LetsCinema (@letscinema) March 11, 2023