Sanjana Galrani | సినిమాల కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది సంజనా గల్రాని. అప్పుడెప్పుడో 14 ఏళ్ళ కింద ప్రభాస్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాకి ముందే కన్నడ మర్డర్ రీమేక్‌లో నటించి సంచలనం రేపింది సంజన. అందులో 80 శాతం న్యూడ్‌గానే నటించి హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో మల్లికా శరావత్ కంటే ఎక్కువగానే అందాలు ఆరబోసి సెక్సీ ఇమేజ్ సొంతం చేసుకుంది. బుజ్జిగాడు తర్వాత పలు తెలుగు చిత్రాలలో నటించి అలరించింది సంజన.
తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోని సంజనా కన్నడలో మాత్రం ఓ రేంజ్ స్టార్డమ్ సంపాదించింది. అయితే సినిమాల కంటే కూడా ఈమె డ్రగ్స్ కేసుతోనే ఎక్కువగా ఫేమస్ అయిపోయింది. డ్రగ్స్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలుగా పట్టుబడి జైలుకు కూడా వెళ్లి వచ్చింది. ఇక 2020లో సైలెంట్‌గా వివాహం చేసుకుంది సంజన. పాషా అనే డాక్టర్‌ను రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ విషయాన్ని మాత్రం బయటికి చెప్పలేదు. పెళ్లి తర్వాత గ్రాండ్‌గా రిసెప్షన్ అరేంజ్ చేయాలని అనుకున్నప్పటికీ.. లాక్ డౌన్ వల్ల సాధ్యం కాలేదని తెలిపింది.
సంజనా సినిమాలకి దూరమైన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా సంజనా గల్రాని సోషల్ మీడియా ద్వారా గుడ్ న్యూస్ పంచుకుంది.తాను రెండో సారి తల్లి కాబోతున్నట్టు ప్రకటిస్తూ బేబి బంప్ ఫోటోలు షేర్ చేసింది. కొత్త వెలుగు మీ జీవితంలో శాంతి, శ్రేయస్సు ఆనందాన్ని తీసుకురావాలని అనుకుంటున్నాను. ఈ పండుగ నాకు చాలా ప్రత్యేకం.ఎందుకంటే మా కుటుంబంలోని కొత్త సభ్యుడు అతి త్వరలో మాతో చేరాలని మేము ఎదురు చూస్తున్నాము. దయచేసి మీ ప్రార్ధనలు, ఆశీర్వాదాలు నా పై ఉంచండి. ఈ నూతన సంవత్సరంలో మీరు కోరుకున్నదంతా సాధించండి అంటూ సంజనా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.