యువ హీరో సంగీత్ శోభన్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న వినోదాత్మక ప్రేమకథ ‘అంతా రాములోరు చూస్కుంటారు’. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది. టైటిల్ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
గోదావరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇదని, ఆడియన్స్ తప్పకుండా ఈ సినిమాలో ప్రేమలో పడిపోతారని నిర్మాత ధీరజ్ మొగిలినేని చెప్పారు. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అనే టైటిల్ తాము ఊరికే పెట్టలేదని, దాని వెనుక కాన్సెప్ట్ ఉందని దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెలిపారు. ‘ఇందులో నా పేరు మారుతి. జీవిత భారమంతా రాముడిపై వదిలేసి బతికే యువకుడిగా కనిపిస్తా. ఇది అనుభూతిని పంచే ప్రేమకథ’ అని హీరో సంగీత్శోభన్ పేర్కొన్నారు.