Samyuktha Menon | హాట్ స్టిల్స్‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ‘భీమ్లా నాయక్’ భామ
తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా. అది కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ (Bheemla Nayak). మొదటిసారే ఇలాంటి భారీ ప్రాజెక్టుతో సంయుక్తామీనన్ టాలీవుడ్ (Tollywood)కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో డానియల్ శేఖర్‌గా నటించిన రానా భార్యగా అద్బుతంగా నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. కథానుగుణంగా కొంచెం డీగ్లామరస్‌గా కనిపించిన సంయుక్తామీనన్ (Samyuktha Menon)కు ఈ మూవీలో అందాల ఆరబోతకు మాత్రం అవకాశం లేకుండా పోయింది.
సినిమాలో ఆ ఛాన్స్ లేకపోతే ఏంటీ..అందాల కనువిందుకు సోషల్ మీడియా ఉందిగా అన్నట్టుగా తాజాగా ఈ కేరళ కుట్టి బికినీ గాళ్‌గా దర్శనిమిస్తోంది. టూ పీస్ బికినీలో గ్లామరస్ డాళ్‌గా మారిపోయి స్విమ్మింగ్ పూల్‌లో సేద తీరింది సంయుక్తా మీనన్. ఈ బ్యూటీ ఫొటోలు కొన్ని ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల సోషల్ మీడియా పేజీల్లో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. కాల్విన్ క్లీన్ స్విమ్ వేర్లో నీటిలో తడిసిముద్దై కెమెరాకు పోజులిచ్చింది. సంయుక్తామీనన్ హాట్ హాట్ లుక్‌లో నెటిజన్ల మతులుపోగొడుతోంది.

ఈ భామ స్టిల్స్ ఇపుడు ఆన్లైన్లో హల్ చేస్తున్నాయి. సంయుక్తామీనన్ తెలుగు, తమిళ భాషల్లో ధనుష్‌తో కలిసి వాథి సినిమాలోనటిస్తోంది. తెలుగులో సార్ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. దీంతోపాటు మలయాళంలో, కన్నడలో ఒక్కో సినిమా చేస్తోంది.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

