Samyuktha Menon | సంయుక్త మీనన్ పెళ్లి పుకార్లు మళ్లీ హాట్ టాపిక్ ..ఈ బ్యూటీ రియాక్షన్ ఏంటి?
Samyuktha Menon | మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు పెళ్లి పుకార్లతో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో కూడా సంయుక్త పెళ్లి గురించి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు స్వయంగా స్పందించిన సంయుక్త మీనన్… తన దృష్టి పూర్తిగా కెరీర్‌పైనే ఉందని, ప్రస్తుతం వివాహంపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది.
Samyuktha Menon | మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వరుస విజయాలతో టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ… ఇప్పుడు పెళ్లి పుకార్లతో మళ్లీ వార్తల్లో నిలిచింది. గతంలో కూడా సంయుక్త పెళ్లి గురించి వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పుడు స్వయంగా స్పందించిన సంయుక్త మీనన్… తన దృష్టి పూర్తిగా కెరీర్‌పైనే ఉందని, ప్రస్తుతం వివాహంపై ఎలాంటి ఆలోచన లేదని స్పష్టం చేసింది. అయితే తాజాగా మళ్లీ ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. షూటింగ్స్‌తో బిజీగా ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం 30 ఏళ్ల వయసులో ఉన్న సంయుక్త… తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస అవకాశాలతో కెరీర్లో అత్యున్నత దశలో ఉంది. వరుస హిట్లతో “గోల్డెన్ లెగ్”గా పేరుతెచ్చుకున్న ఈ హీరోయిన్… దర్శకుల ఫేవరెట్‌గా మారింది. కొంతమంది నెటిజన్లు రష్మిక మందన్నమాదిరిగానే సంయుక్త కూడా పెళ్లి తర్వాత తన కెరీర్‌ను కొనసాగించే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగడం సాధారణమవుతోంది. ఇప్పటికే సంయుక్త మీనన్ చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా నిఖిల్ సిద్ధార్థ సరసన ‘స్వయంభు’, అలాగే ‘బ్లాక్ గోల్డ్’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ఈ ప్రాజెక్టులు ఆమె కెరీర్‌కు మరింత బూస్ట్ ఇవ్వనున్నాయి.
పెళ్లి పుకార్లపై గతంలో క్లియర్‌గా స్పందించిన సంయుక్త… ఈసారి కూడా తనదైన శైలిలో ఈ వార్తలకు చెక్ పెడుతుందా? లేక నిజంగానే కొత్త జీవితానికి సిద్ధమవుతోందా? అన్నది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం చూస్తుంటే… సంయుక్త మీనన్ కెరీర్ జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో పెళ్లి వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే… అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

