Sodara Trailer | రెండేండ్ల గ్యాప్ తర్వాత మరోసారి సంపూర్ణేశ్ బాబు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన నటించిన సోదరా సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కాబోతున్నది. అన్నదమ్ముల ఎమోషన్స్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు తమ్ముడిగా సంజోశ్ నటించాడు. మన్మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. నాలుగు రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోని మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ఆదిత్య మ్యూజిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
చిన్నతనం నుంచి ఎంతో ప్రేమగా పెరిగిన ఇద్దరు అన్నదమ్ములు వారి పెళ్లి కోసం పడే కష్టాలే ఈ సినిమాగా తెరకెక్కినట్లుగా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో అటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు, యాక్షన్ రెండు సమపాళ్లలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరూ సంపూర్ణేశ్బాబుకు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు. ట్రైలర్ బాగుందని.. సినిమా కూడా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఈ సినిమాలో ఆర్తి, ప్రాచి బన్సాల్ హీరోయిన్లుగా నటించారు. క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చగంలా ఈ సినిమాను నిర్మించారు.
One story. Two brothers. Infinite emotions ✨#Sodara trailer strikes deep, crossing 1M+ views on #YouTube! 💥👬
▶ https://t.co/n7kkfOUV0E#SodaraOnApril25th@sampoornesh @actorsanjosh @sunilkashyapwav #BalajiMangu #Ashwini #PranchiBansal #ChandraChaganla… pic.twitter.com/RrlBHWsFGw— Aditya Music (@adityamusic) April 14, 2025