Samantha | తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో తన నటనతో పాటు స్టైలిష్ ఫ్యాషన్ సెన్సేషన్‌గా నిలిచిన అందాల తార సమంత తాజాగా కొత్త లగ్జరీ వాచ్ ధరించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల సమంత సినిమాల కన్నా కూడా బ్రాండ్లని ప్రమోట్ చేస్తూ ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. తాజాగా ఒక లగ్జరీ వాచ్ ను ధరించిన సామ్ అందుకు సంబంధించిన ఫొటోలను ఫేర్ చేయగా,ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.అయితే సమంత ధరించిన ఆ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించగా, అది ఏ కంపెనీది..? దాని ధర ఎంత ? అంటూ గూగుల్ లో ఆరా తీస్తున్నారు . ఈ క్రమంలో సమంత ధరించిన వాచ్ ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ కాగా , దీని రేటు సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
ఇది తెలుసుకున్న నెటిజన్లు అవాక్కవుతున్నారు. గతంలోనూ సమంత పలు స్టైలిష్ అండ్ లగ్జరీ వాచెస్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఎక్కువగా బల్గారీ సర్పెంటీ వాచ్ (రూ. 45 లక్షలకు పైగానే) ధరించి కనిపిస్తుంటుంది. మొత్తానికి సమంత ఈ కొత్త వాచ్‌తో హాట్ టాపిక్ అయింది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మా ఇంటి బంగారం” సినిమాలో నటిస్తోంది. అంతేకాదు, రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న వెబ్ సిరీస్ “రక్త బ్రహ్మాండ్” లోనూ సమంత తన నటనా ప్రతిభను చాటేందుకు కృషి చేస్తుంది.
ఇకపోతే సమంత-రాజ్ జంట ప్రేమ వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి కలిసి బయటకు రావడం, ఒకే కారులో వెళ్లిపోవడం వంటివి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తుందని, త్వరలోనే వివాహం చేసుకోవడం ఖాయం అని అంటున్నారు. కొన్నాళ్లుగా వీరి రిలేషన్ గురించి అనేక వార్తలు వస్తున్నా కూడా సమంత కాని, రాజ్ కాని స్పందించింది లేదు.