తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఎప్పుడూ ఏదో ఒక ప్రాజెక్టుతో బిజీగా ఉంటుంది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ (Varun Dhawan)తో వెబ్ సిరీస్ చేస్తున్న విషయం తెలిసిందే. రాజ్&డీకే (Raj and DK)దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన Citadel ఇండియన్ వెర్షన్‌గా తెరకెక్కుతుంది ఈ వెబ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కోసం సమంత మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టిందట.
నిపుణుల సమక్షంలో మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ (martial arts) నేర్చుకునే పనిలో బిజీగా ఉన్నట్టు టాక్. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తర్వాత రాజ్&డీకే డైరెక్షన్లో సామ్ చేస్తున్న రెండో ప్రాజెక్టు ఇది. మరోవైపు శివనిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తోంది. లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది.
దీంతోపాటు ఫీ మేల్ సెంట్రిక్ సబ్జెక్టు యశోద కూడా చేస్తోంది. మరోవైపు గుణశేఖర్ డైరెక్షన్లో శాకుంతలం సినిమా చేస్తుండగా..ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.