Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ చివరిగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ఈ సినిమా తర్వాత చరణ్ అభిమానులు అతడి నుంచి ఓ మాస్ పాన్-ఇండియా హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పెన సినిమాతో సంచలనం రేపిన దర్శకుడు బుచ్చిబాబు సానా తో కలిసి కొత్త సినిమా ప్రకటించాడు చెర్రీ.
తన మొదటి సినిమాతోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఈసారి రామ్ చరణ్‌తో భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు పెద్ది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. రీసెంట్గా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతుండగా, ఈ సినిమాపై పలు ఆసక్తికర రూమర్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో ఓ మాస్ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని, అందులో చరణ్‌కు జతగా ఓ స్టార్ హీరోయిన్ను తీసుకున్నారన్న వార్త వైరల్ అవుతోంది.
అయితే ఆమె ఎవరనేది అధికారికంగా ప్రకటించనప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం గట్టిగా వినిపిస్తున్న పేరు సమంత. “పుష్ప”లో “ఉ అంటావా మామ” అంటూ అదిరిపోయే డాన్స్ చేసి జనాన్ని ఊపేసిన సమంత ఇప్పుడు చరణ్ పక్కన స్టెప్పులు వేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్. బాలీవుడ్ నుంచి హీరోయిన్ కాబోలు అని కొందరు అనుకుంటున్నప్పటికీ, టాలీవుడ్ నుండి సమంతే దాదాపుగా కన్ఫర్మ్ అంటున్నారు ఫ్యాన్స్. సమంత, రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంతకీ ఈ స్పెషల్ సాంగ్‌కి సంగీతం అందించేది ఎవరో తెలుసా? మ్యూజిక్ మాస్ట్రో ఏ.ఆర్. రెహమాన్ఈ పాటను ఉత్తరాంధ్ర ఫోక్ స్టైల్ లో చిత్రీకరించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదైమైనా చరణ్- సమంత కాంబినేషన్ మళ్లీ స్క్రీన్ పై కనిపించనుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.