Samantha | నాగచైతన్య, సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకొని టాలీవుడ్ బెస్ట్ పెయిర్స్‌లో ఒకరిగా నిలిచారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించని విధంగా కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల ప్రకటన తర్వాత చై, సామ్ అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒక్కోసారి సమంత.. నాగ చైతన్యది తప్పు అన్నట్టు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసింది. తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తుంది. కాని నాగ చైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు.
అయితే సమంత, నాగ చైతన్య విడాకులకి కారణం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. వీరిద్దరు విడిపోవడానికి ఖచ్చితమైన కారణాలు వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా సమంత లైక్ వివాదం రగిల్చింది అనే చెప్పాలి. వైవాహిక బంధాలు విచ్ఛిన్నం కావడంపై వచ్చిన ఒక సోషల్‌మీడియా పోస్ట్‌ను సమంత లైక్ చేయడంతో ఇప్పుడు వారి విడాకుల విషయం హాట్ టాపిక్ అయింది. సమంత లైక్ చేసిన పోస్ట్ సారాంశం చూస్తే..అనారోగ్యంతో ఉన్న భార్యను వదిలించుకోవడానికే భర్తలు మొగ్గు చూపుతున్నారనేది ఆ పోస్ట్ కాన్సెప్ట్.
జీవిత భాగస్వామి తీవ్ర అనారోగ్యానికి గురైతే, ఆ భర్త భార్యను వదిలేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే, మహిళలు మాత్రం భర్త ఆరోగ్యం బాగోకపోయినా అతడిని విడిచిపెట్టాలని ఏ మాత్రం అనుకోవడం లేదు. సర్వే ప్రకారం కూడా ఇది రుజువైంది. భార్యతో ఎమోషనల్ అటాచ్మెంట్ లేకపోవడం వల్లే భర్త ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని సర్వేలో తెలియజేయగా, ఆ పోస్ట్ ని సమంత లైక్ చేయడంతో సోషల్ మీడియాలో వారి విడాకుల విషయం చర్చనీయాంశం అయింది. కొందరు నెటిజన్స్.. సమంతకి మయోసైటిస్ అని తెలియడం వల్లనే నాగ చైతన్య విడాకులు ఇచ్చాడని, సమంత ఇప్పుడు దానిని ఇలా ఇన్‌డైరెక్ట్‌గా తెలిపిందని కామెంట్ చేస్తున్నారు.