Samantha | హైదరాబాద్‌లోని ఫ్యాషన్ ప్రపంచంలో మరో కొత్త మైలురాయి చేరింది. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ‘సిరిమల్లె శారీస్’ (Sirimalle Sarees) తన నూతన షోరూమ్‌ను జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్, పాన్ ఇండియా నటి సమంత రుత్ ప్రభు ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి షోరూమ్‌ను ప్రారంభించారు.
షోరూమ్ ప్రారంభోత్సవం అనంతరం సమంత మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో చీరకున్న ప్రాముఖ్యతను కొనియాడారు. “చీర అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, అది ప్రతి మహిళకు ఒక ఆత్మీయ స్నేహితురాలు. సిరిమల్లె శారీస్లో ఉన్న కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా చేనేత వస్త్రాలు, హస్తకళల గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఇక్కడి డిజైన్లు ఉన్నాయి. మన సంప్రదాయ వైభవాన్ని ప్రతిబింబించే ఇలాంటి బ్రాండ్లను ప్రోత్సహించడం సంతోషంగా ఉంది” అని ఆమె పేర్కొన్నారు.
సంస్థ వ్యవస్థాపకురాలు సౌజన్య మాట్లాడుతూ.. తమ బ్రాండ్ విస్తరణలో జూబ్లీహిల్స్ షోరూమ్ ప్రారంభం ఒక కీలక ఘట్టమని తెలిపారు. “నాణ్యత, నమ్మకం, వినియోగదారుల సంతృప్తియే మా ప్రథమ ప్రాధాన్యత. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన చేనేత కార్మికులను ప్రోత్సహిస్తూ, కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన డిజైన్లను మేము స్వయంగా రూపొందిస్తున్నాము. ఆధునికతతో పాటు సంప్రదాయం ఉట్టిపడేలా మా వస్త్రశ్రేణి ఉంటుంది” అని వివరించారు.
కొత్తగా ప్రారంభమైన ఈ షోరూమ్‌లో పట్టు వస్త్రాలైన కాంచీపురం సిల్క్స్, బనారసీ శారీలు. పెళ్లికూతుళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజైనర్ బ్రైడల్ వేర్. సంప్రదాయ చేనేత చీరలు. పండుగలు, శుభకార్యాలకు సరిపోయే ఆధునిక డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ రంగ నిపుణులు, సినీ ప్రముఖులు మరియు సమంతను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.