Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha).. ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను సైతం పూర్తి చేసింది. గత కొన్ని రోజులుగా మయోసైటిస్ తో బాధపడుతున్న సామ్.. తన సమయాన్ని వ్యక్తిగత, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. తన తదుపరి ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా, ప్రస్తుతం సామ్.. ఇండోనేషియాలోని బాలికి వెకేషన్ కోసం వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే తన స్నేహితులతో కలిసి బాలి (Bali) ట్రిప్ కు వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ జిమ్ క్లబ్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను తాజాగా ఇన్ స్టా స్టోరీస్ లో పోస్టు చేసింది. వీడియోలో సామ్ ఓ వ్యక్తిని తన చేతులు, కాళ్ల సాయంతో గాల్లో నిలబెడుతూ కనిపించింది. సమంత స్టంట్ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.
Also Read..
Ms Dhoni | వింటేజ్ కార్ లో ధోనీ చక్కర్లు.. వీడియో వైరల్
Enforcement Directorate | ఈడీ చీఫ్ పదవిని పొడిగించాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించిన కేంద్రం
Anand Mahindra | మ్యూజికల్ రోడ్డు.. ఆలోచన అద్భుతమంటూ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా