Samantha | తల్లితో కలిసి అమెరికా పయనమై వెళ్లిన సమంత.. ఎందుకంటే..?
Samantha | టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) అమెరికా (America) పయనమై వెళ్లారు. నిన్నటి వరకూ ‘ఖుషీ’ (Kushi) చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సామ్.. ఆ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ అవ్వగానే హడావుడిగా తన తల్లితో కలిసి అమెరికా ఫ్లైట్ ఎక్కారు.
Samantha | టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) అమెరికా (America) పయనమై వెళ్లారు. నిన్నటి వరకూ ‘ఖుషీ’ (Kushi) చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సామ్.. ఆ సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ అవ్వగానే హడావుడిగా తన తల్లితో కలిసి అమెరికా ఫ్లైట్ ఎక్కారు. ఈ మేరకు సమంత ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. అయితే, గత కొన్నిరోజులుగా మయోసైటిస్ (Myositis)తో బాధపడుతున్న సామ్.. దాని చికిత్స కోసం సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వ్యాధి చికిత్సకు అమెరికా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామ్ అమెరికా పయనమవడంతో అందరూ చికిత్స కోసమే అని అనుకుంటున్నారు.
అయితే, సామ్ అమెరికా వెళ్లింది చికిత్స కోసం కాదట. ఇటీవలే సమంతకు అరుదైన గౌరవం లభించిన విషయం తెలిసిందే. వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ (India Day Parade)లో పాల్గొనే అవకాశం లభించింది. ఈ నెల 20వ తేదీన న్యూయార్క్ (New York)లో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సామ్ పాల్గొనబోతోంది. ఆ వేడుకల కోసమే సమంత తన తల్లితో కలిసి అమెరికా బయలు దేరి వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఈ వేడుకలకు సామ్‌తో పాటు నటుడు రవికిషన్, నటి జాక్వైలిన్ ఫెర్నాండేజ్‌లకు కూడా ఆహ్వానం అందింది. గతంలో ఈ కార్యక్రమానికి అభిషేక్ బచ్చన్, రానా, అల్లు అర్జున్, అర్జున్ రాంపాల్, సన్నీ డియోల్, రవీనా టాండన్, తమన్నాలు హాజరయ్యారు.
ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ఖుషీ రిలీజ్‌కు సిద్దంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పాటలు సినిమాపై ఓ రేంజ్లో హైప్ క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీనితో పాటుగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సిటాడెల్ (Citadel) వెబ్ సిరీస్‌లో నటించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో సామ్ కాప్‌గా కనిపించనుంది. ఈ సిరీస్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Our cutie with mom off to New York 🤌🏼🫶🏼
Happy safe journey Sammy❤️@Samanthaprabhu2 #SamanthaRuthPrabhu #Samantha pic.twitter.com/bk0svKb7zS— RoshSam💌 (@RoshSamLover) August 18, 2023
Also Read..
Meta | వారంలో 3 రోజులు తప్పకుండా ఆఫీసుకు రావాల్సిందే.. లేదంటే, ఉద్యోగులకు మెటా సీరియస్ వార్నింగ్
Varuntej – Lavanya | పెళ్లి ఎప్పుడో చెప్పిన వరుణ్‌తేజ్.. ఎక్కడంటే..?
Rahul Gandhi | పాంగాంగ్ సరస్సుకు బైక్ యాత్ర చేపట్టిన రాహుల్.. పిక్స్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

