Varuntej – Lavanya | పెళ్లి ఎప్పుడో చెప్పిన వరుణ్‌తేజ్.. ఎక్కడంటే..?
Varuntej – Lavanya | పెళ్లిపై మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పందించారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అని, ఈ ఏడాది చివర్లో పెళ్లి ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించారు.
Varuntej – Lavanya | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) నిశ్చితార్థం జూన్ 9వ తేదీన నాగబాబు ఇంట్లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఎంగేజ్మెంట్ అయినప్పటికీ పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. దీంతో నెట్టింట మెగా ఫ్యాన్స్ తెగా హడావుడి చేసేస్తున్నారు. పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ..? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే వీరి వివాహం ఆగస్టులో ఉంటుందని డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లుగా తెరపైకి వార్తలు వచ్చాయి.
అయితే, ఈ వ్యవహారంపై తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పందించారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో పెళ్లి ప్లాన్ చేసుకున్నట్లు వెల్లడించారు. ‘ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో పెళ్లి ఉంటుంది. ఇందుకోసం డేట్స్ చూస్తున్నాం. నేను హైదరాబాద్‌లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ, పెళ్లిని ప్రైవేట్ వ్యవహారంగా ఉంచాలనుకోవడం వల్ల అది సాధ్యం కాదు. అందుకే డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) ప్లాన్ చేసుకున్నాం. ఇందుకోసం భారత్‌లో మూడు ప్రదేశాలు, విదేశాల్లో రెండు ప్రదేశాలను అనుకున్నాం. అందుతో ఒక ప్రాంతాన్ని త్వరలో ఎంపిక చేస్తాం’ అని చెప్పుకొచ్చారు.
మరోవైపు లావణ్యతో తన ప్రేమ గురించి కూడా వరుణ్‌తేజ్ స్పందించారు. ‘మిస్టర్’ చిత్రంలో మొదటిసారి కలిసి నటించామని.. అప్పుడే తాము మంచి స్నేహితులమయ్యామని తెలిపారు. కొన్నిరోజులకే ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారిందన్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో రిలేషన్లోకి వచ్చామని, లావణ్యకు తానే మొదటిగా ప్రపోజ్ చేసినట్లు వరుణ్ తేజ్ వెల్లడించారు. ‘అంతరిక్షం’ చిత్రానికి ముందే తమ స్నేహం ప్రేమగా మారినట్లు తెలిపారు. తనకు ఏమి ఇష్టమో లావణ్యకు బాగా తెలుసునని చెప్పారు. ప్రస్తుతం తాను వాడుతున్న ఫోన్ లావణ్యనే గిఫ్ట్ చేసిందని చెప్పుకొచ్చారు. తాను ఓ ప్రైవేట్ వ్యక్తినని.. లావణ్యతో ప్రేమ విషయం తన తల్లిదండ్రులకు ముందే తెలుసునని వరుణ్ తేజ్ వివరించారు.
వరుణ్‌తేజ్ ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna) చిత్రంలో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. గూఢచారి కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది.
Also Read..
Vivek Ramaswamy | రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఒక్కటే మార్గం : అమెరికా ప్రెసిడెంట్ అభ్యర్థి
Brahmanandam | ఘనంగా బ్రహ్మానందం చిన్నకుమారుడి వివాహం.. హాజరైన ప్రముఖులు
Nidhhi Agerwal | ఇస్మార్ట్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. ప్రభాస్ సినిమాలో నటించే ఛాన్స్!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

