Samantha | ‘నార్త్ వర్సెస్ సౌత్ సినిమాల’పై సమంత కామెంట్స్ వైరల్..!
Samantha | గతేడాది బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమ దారుణమైన దశను చవిచూసింది. హిట్ అవుతాయనుకున్న లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha), రక్షా బంధన్ (Raksha Bandhan), సర్కస్ (Cirkus), షంషేరా (Shamshera) వంటి స్టార్ హీరోల సినిమాలు నిరాశ పరిచాయి.
Samantha | గతేడాది బాలీవుడ్ (Bollywood) చిత్ర పరిశ్రమ దారుణమైన దశను చవిచూసింది. హిట్ అవుతాయనుకున్న లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha), రక్షా బంధన్ (Raksha Bandhan), సర్కస్ (Cirkus), షంషేరా (Shamshera) వంటి స్టార్ హీరోల సినిమాలు నిరాశ పరిచాయి. అదే సమయంలో సౌత్‌లో రిలీజైన కేజీఎఫ్-2 (KGF Chapter 2), కాంతారా (Kantara) వంటి చిన్న సినిమాలు ప్రభంజనమే సృష్టించాయి. వసూళ్ల పరంగా కాసుల వర్షం కురిపించాయి. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు పొందాయి. గతేడాది వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అదరగొట్టింది. ఎన్నో అవార్డులను సైతం కొల్లగొట్టింది. దీంతో ‘సౌత్ వర్సెస్ నార్త్ సినిమాలు’ (North vs South Films) అన్న చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్ కథానాయిక సమంత (Samantha)ను ఓ విలేకరు సౌత్ వరస్సెస్ నార్త్ సినిమాలు అంశంపై (North vs South Films Controversy) ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సామ్ ‘ప్రస్తుతం నార్త్, సౌత్ సినిమాల మధ్య ఎలాంటి అడ్డుగోడా లేదు. దీనిపై నేను చర్చించదల్చుకోలేదు. ఒక నటిగా, నేను అన్ని భాషల చిత్రాల్లో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు కూడా అన్ని భాషల సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం సామ్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ (Shaakunatalam). గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సామ్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. దీంతో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషీ’ (Kushi)చిత్రంలోనూ నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. బాలీవుడ్లో ‘సిటాడెల్’ (Citadel) అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. అమెరికన్ యాక్షన్ టీవీ సిరీస్‌కు హిందీ రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్‌ను రాజ్ డీకే తెరకెక్కిస్తున్నారు.
Also Read..
Upasana | దుబాయ్‌లో ఉపాసన బేబీ షవర్ వేడుక.. వీడియో వైరల్
Mrunal Thakur | నువ్వు మా సీతవు కాదు.. మృణాల్‌పై మండిపడుతున్న నెటిజన్లు..!
Agent Movie | ఏజెంట్‌కు ఏమైంది.. ఈ సారైనా వస్తున్నాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

