Agent Movie | ఏజెంట్‌కు ఏమైంది.. ఈ సారైనా వస్తున్నాడా?
Agent Movie Release | యూత్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో అంతగా లేదు. జనాల్లోకి సినిమా వెళ్లాలంటే ప్రమోషన్లు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో నెల రోజుల నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయాలి. కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో అసలు సినిమా విడుదలవుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి.
Agent Movie Release | ఈ మధ్య కాలంలో ‘ఏజెంట్’ సినిమా వాయిదా పడినన్ని సార్లు ఏ సినిమా పోస్ట్ పోన్ అవ్వలేదు. రేపో మాపో విడుదలవుతుందని అనుకునే సమయంలో పోస్ట్ పోన్ అంటూ అక్కినేని అభిమానుల ఆశలపై మేకర్స్ నీళ్లుచల్లుతూ వచ్చారు. గతేడాది అగస్టులో ఖచ్చితంగా వస్తుందంటూ మేకర్స్ ప్రకటించినా.. వారం రోజులు ఉందనగా పోస్ట్‌పోన్ అయింది. ఇక క్రిస్మస్కి వస్తుందంటూ మరో స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఏవేవో కారణాలు చెప్పి మళ్లీ వాయిదా వేసారు. ఇక అన్ని కుదిరితే సంక్రాంతికి పక్కా వస్తుందంటూ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తీరా సంక్రాంతి వచ్చే సరికి సైలెంట్ అయిపోయారు.

దాంతో సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ కావాలంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేశారు. ఈ క్రమంలో చిత్రబృందం రెండు నెలల ముందు ఏప్రిల్ 28న సినిమా ఖచ్చితంగా రాబోతుందంటూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అయితే ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో మరో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే సినిమా రిలీజ్‌కు ఇంకా నెల రోజులు కూడా లేదు. కాగా పాట చిత్రీకరణతో పాటు కొన్ని రోజుల షూటింగ్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో షూటింగ్ ఎప్పుడు పూర్తి చేస్తారు. ప్రమోషన్లు ఎప్పుడు మొదలుపెడతారు అంటూ అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యూత్‌లో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. కానీ ఫ్యామిలీ ఆడియెన్స్‌లో అంతగా లేదు. జనాల్లోకి సినిమా వెళ్లాలంటే ప్రమోషన్లు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పాన్ ఇండియా సినిమా కావడంతో నెల రోజుల నుంచి ప్రమోషన్లు స్టార్ట్ చేయాలి. కానీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉండటంతో అసలు సినిమా విడుదలవుతుందా? అనే సందేహాలు అభిమానుల్లో వ్యక్తం అవుతున్నాయి. మరీ దీనిపై మేకర్స్ క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌తో కలిసి సురేందర్ రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్గా నటిస్తుంది.

గతకొంత కాలంగా అఖిల్ కమర్షియల్ హిట్టు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచి వరుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కాస్త ఊరటనిచ్చింది. కానీ ఈ సినిమా అఖిల్‌కు కమర్షియల్ హిట్టును ఇవ్వలేకపోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ హిట్టు కొట్టాలని సురేందర్ రెడ్డితో ఏజెంట్ కోసం చేతులు కలిపాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడ లేని బజ్ క్రియేట్ చేశాయి. మరి ఈ సినిమాతోనైనా అఖిల్ కమర్షియల్ హిట్టును సాధిస్తాడో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

