Samantha | ఇటీవలే ‘ఖుషి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అగ్ర కథానాయిక సమంత. ప్రస్తుతం ఆమె విరామ సమయాన్ని ఆస్వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో సమంత తదుపరి సినిమా ఏమిటన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నది. సల్మాన్‌ఖాన్ సరసన ఈ భామ నటించబోతున్నదని గత కొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. విష్ణువర్ధన్ దర్శకత్వంలో అగ్ర నిర్మాణ కరణ్‌జోహార్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో సమంతను నాయికగా ఖరారు చేశారని బాలీవుడ్లో కథనాలొచ్చాయి.
వీటిపై సమంత స్పందించింది. ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఆమె తన తదుపరి సినిమాల గురించి మాట్లాడింది. సల్మాన్‌ఖాన్‌తో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ‘ప్రస్తుతం నేను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నా. సినిమాల విషయంలో మరింత సెలెక్టివ్‌గా ఉండాలనుకుంటున్నా. రొటీన్ కథల్లో అస్సలు నటించను. దక్షిణాదితో పాటు హిందీలో కూడా ఆఫర్లొస్తున్నాయి. ఏదైనా సినిమా ఖరారైతే ఆ వివరాల్ని వెంటనే మీతో పంచుకుంటా’ అని చెప్పింది.