Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు చాలా రోజుల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. హెల్త్ ఇష్యూస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్, ఇప్పుడు ఫుల్ ఎనర్జీతో రీ-ఎంట్రీకి రెడీ అయ్యారు. అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఆమె సోలో పర్ఫార్మెన్స్ ఇప్పుడు పెద్ద తెరపై కనిపించబోతోంది. ‘ఖుషి’ (2023) తర్వాత సమంతని మళ్లీ ఒక పవర్ఫుల్ లీడ్ రోల్లోచూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆమె కేవలం హీరోయిన్‌గానే కాకుండా ప్రొడ్యూసర్‌గా కూడా బరిలోకి దిగుతున్నారు.
సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పై నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ ప్రాజెక్ట్‌ను ఆమె చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నారు. సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండస్ట్రీలో మంచి బజ్ క్రియేట్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేగంగా కొనసాగుతోంది. సమంతతో పాటు మిగిలిన స్టార్ కాస్ట్‌పై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి. సమంత-నందిని కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ‘ఓ బేబీ’తో ఈ జంట భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
అయితే ‘మా ఇంటి బంగారం’ మాత్రం రెగ్యులర్ ఫ్యామిలీ డ్రామా కాదు. ఇది 1980ల బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్ అని సమాచారం. ఈ జానర్ సమంతకు, నందిని రెడ్డికి కొత్తది కావడంతో ఆసక్తి మరింత పెరిగింది. ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా సమంత లుక్ ఈ సినిమాలో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అవబోతోందని సమాచారం. ఆ పీరియడ్ సెటప్‌కి తగినట్టుగా ఆమె స్టైల్, బాడీ లాంగ్వేజ్ అన్నీ మారబోతున్నాయి. ఒకవైపు నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, మరోవైపు నిర్మాతగా బాధ్యతలు తీసుకుని సమంత ఇప్పుడు తన కెరీర్లో కొత్త చాప్టర్ ప్రారంభించారు. ‘యశోద’ తర్వాత సమంత నుంచి ఆ రేంజ్ సోలో పర్ఫార్మెన్స్ రాలేదు. ఈసారి ఆమె ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్‌తో తిరిగి వస్తుండటంతో అభిమానులు ఫుల్ ఎగ్జైటెడ్‌గా ఉన్నారు.