Samantha | భవిష్యత్తు మహిళా డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌తో

సినీరంగంలో మహిళాసాధికారత, అవకాశాల కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ప్రతిభను ప్రదర్శించే సరైన వేదికల్ని అందిపుచ్చుకోవడమే మహిళల ముందున్న పెద్ద సవాలు అని ఆమె పేర్కొంది. బాలీవుడ్ ‘ది ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా ఈ అమ్మడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అందులో తమిళ రెబల్ రాజీ పాత్రలో చక్కటి అభినయంతో అందరి ప్రశంసలందుకుంది. తన పదకొండేళ్ల సుదీర్ఘ కెరీర్లో రాజీ తరహా పాత్రను ఎవరూ ఆఫర్ చేయలేదని, తన ప్రతిభాపాటవాల్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం ఆ పాత్ర ద్వారా లభించిందని సమంత ఆనందం వ్యక్తం చేసింది. చిత్రసీమలో మహిళలకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించడమే తన సరికొత్త లక్ష్యమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘భవిష్యత్తులో మహిళా డైరెక్టర్స్, టెక్నీషియన్స్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నా. వారికి అవకాశాలు కల్పించి పైకి తీసుకురావడం ప్రధానంగా భావిస్తున్నా. నాలాగే ఎంతో మంది ప్రతిభావంతులైన మహిళలు సినీరంగంలో ఉన్నారు. అవకాశాలు లేక వారు రాణించడం లేదు. మహిళలు పరస్పరం సహకరించుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. అలాగే మహిళా నేపథ్య ఇతివృత్తాల్ని విరివిగా రాయాలని రచయితల్ని కోరుతున్నా’ అని సమంత పేర్కొంది. తెలుగులో ఆమె నటిస్తున్న ‘శాకుంతలం’ ఇటీవల చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

