అందాల చందమామ సమంత 2010లో గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేకకుల మనసులని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఇందులో సమంత క్యూట్ లుక్స్, నిష్కల్మషమైన చిరునవ్వు యువత హృదయాలని కొల్లగొట్టింది. ఈ సినిమా సమయంలోనే చైతూతో ప్రేమలో పడ్డ సమంత 2017 అక్టోబర్ 17న వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత సమంత తన కెరీర్‌కి గుడ్ బై చెబుతుందని అందరు అనుకున్నారు. కాని అంతకు మించిన స్పీడ్‌తో దూసుకుపోతుంది. సెలక్టివ్‌గా వైవిధ్యభరతమైన సినిమాలు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళుతుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో కూడా ఆకట్టుకుంటుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఓ బేబీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సామ్ ..ప్రస్తుతం తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తుంది. రీసెంట్గా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసింది.
సమంత సోషల్ మీడియాలోను చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. 18 మిలియన్ ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ కి దాదాపు 25 నుండి 30 లక్షల వరకు తీసుకుంటోందని సమాచారం. అయితే సమంత తాజాగా తన సొంత లేబుల్ ‘సాకీ’ దుస్తులు ధరించి కారులో కూర్చొని ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీనికి మై లవ్ సాకీ వరల్డ్ అనే కామెంట్ పెట్టింది. ఈ ఫొటోకి 3 గంటలలోనే 10 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ పిక్కి ఈ రేంజ్లో లైకులు రావడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్ ఇందులో అంత స్పెషల్ ఏముందా అని ఆసక్తిగా గమనిస్తున్నారు.