Samantha|అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య టాలీవుడ్ హీరోయిన్ సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.కొన్నేళ్ల పాటు సజావుగానే సాగిన వీరి సంసారంకి బీటలు వారాయి. ఎవరు ఊహించని విధంగా వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వారి విడాకుల గురించి ఎవరికి క్లారిటీ లేదు. ఇక సమంత నుండి విడిపోయిన తర్వాత నాగ చైతన్య కొద్ది రోజుల పాటు సింగిల్‌గా ఉన్నాడు. ఆ తర్వాత మరో నటి శోభితతో ప్రేమలో పడి గత ఏడాది డిసెంబర్లో ఆమెని వివాహం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరు హనీమూన్‌లో భాగంగా పలు ప్రాంతాలకి చక్కర్లు కొడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అలానే తమ రిలేషన్ షిప్ గురించి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
అయితే కొద్ది రోజులుగా శోభిత, నాగ చైతన్య పలు సందర్భాలలో ట్రోలింగ్కి గురవుతున్నారు. ముఖ్యంగా సమంత అభిమానులు వారిని తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. పెళ్లి కార్యక్రమాల నుంచి మొదలుకొని ఇప్పటివరకు శోభిత సమంతనే ఫాలో అవుతున్నారని సమంత అభిమానులు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరోసారి శోభితని టార్గెట్ చేశారు సామ్ ఫ్యాన్స్. రీసెంట్గా నాగ చైతన్య, శోభిత ప్రముఖ మ్యాగిజైన్ “వోగ్” కవర్ ఫొటోస్ కి ఫోజులివ్వగా ఇందులో నాగచైతన్య, శోభిత మంచి స్టైలిష్ దుస్తులలో కనిపించారు. దీంతో ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో శోభిత సమంత వేసినటువంటి డ్రెస్ వేయటంతో ఇక్కడ కూడా ఆమె డ్రెస్ డిజైన్స్ కాపీ కొట్టారు అంటూ విమర్శలు చేస్తున్నారు. శోభిత అఖ్ల్ బ్రాండ్ కి చెందిన సిల్వర్ కలర్ టాసెల్-డిటెయిలింగ్ స్లిప్ డ్రెస్ ధరించగా, దీని ధర దాదాపు రూ.49,593 పైగా ఉంది.అయితే ఓ నెటిజన్ ఈ ఫోటోలపై స్పందిస్తూ శోభిత గతంలో సమంత ధరించిన దుస్తులను ధరించి కాపీ కొట్టిందని అన్నాడు. గతంలో సమంత ఓంబ్రే-హ్యూడ్ టాసెల్డ్ స్కర్ట్ ని ధరించి ఫోటోలకి ఫోజులిచ్చింది. వీరిద్దరి డ్రెస్‌లు కాస్త అటు ఇటుగా ఒకేలా ఉన్న నేపథ్యంలో నెటిజన్స్ శోభితపై విమర్శలు కురిపిస్తున్నారు.