వయసుతో వచ్చే పరిణితి వ్యక్తిత్వంలో ప్రతిబింబిస్తుందని…ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేందుకు ప్రేరణనిస్తుందని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఇటీవల ఓ మాస పత్రిక ముఖచిత్రంపై ఈ సుందరి అందాలొలికిస్తూ హాట్‌హాట్‌గా కనిపించింది. పీకాక్ థీమ్‌తో చేసిన ఈ ఫొటో షూట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోషూట్‌పై సమంత స్పందిస్తూ ‘ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నటిగా ఎంతో పరిణితి సాధించా. ఇప్పుడు మరింత ఆత్మవిశ్వాసంతో సినిమాల్ని ఎంపిక చేసుకుంటున్నా.
సవాళ్లతో కూడుకున్న ఎలాంటి పాత్రకైనా న్యాయం చేయగలననే నమ్మకం కుదిరింది. గతంలో నేను అంత కాన్ఫిడెంట్‌గా ఉండేదాన్ని కాదు’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో పాన్ ఇండియా చిత్రం ‘యశోద’తో పాటు పౌరాణిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో నటిస్తున్నది.