samantha and naga chaitanya | నవంబర్ 23న నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అలాగే ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది ప్రముఖులు చైతూకి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ఎంత మంది నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వచ్చినా కూడా ఒకరు నుంచి వస్తాయా లేదా అని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. ఆ వ్యక్తి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. నాగచైతన్య మాజీ భార్య సమంత. నెల రోజుల క్రితం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు.
కెరీర్ పరంగా అటు చైతూ.. ఇటు సమంత ఇద్దరూ చాలా బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య పుట్టిన రోజు వచ్చింది. విడిపోయినా కూడా తామిద్దరం స్నేహితులుగానే ఉంటామని చెప్పారు నాగ చైతన్య, సమంత. మరి స్నేహితుడి పుట్టిన రోజు కచ్చితంగా విషెస్ చెప్పడంలో తప్పులేదు కదా.. అందుకే సమంత చెబుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈమె తన మాజీ భర్తకు ఎటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. మొన్నటికి మొన్న నయనతార పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. అక్కడే ఉండి సెలబ్రేట్ కూడా చేసింది సమంత. కానీ ఇప్పుడు నాగచైతన్య పుట్టిన రోజు మాత్రం పట్టించుకోలేదు. విషెస్ చెప్పడం కాదు కదా.. అసలు ఆ విషయం తెలియదు అన్నట్లు వ్యవహరించింది. అయితే.. మొన్ననే కదా విడాకులు అయింది.. ఆ మాత్రం బాధ ఉంటుంది అంటున్నారు అభిమానులు. మరి రాబోయే కాలంలో కూడా ఇద్దరి మధ్య వైరం అలాగే ఉంటుందా అనేది చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Samantha: హాట్ టాపిక్‌గా సమంత రెమ్యునరేషన్.. అందరు షాక్
Samantha | గుర్తుపెట్టుకోండి.. మంచిరోజులు వస్తాయి.. వైరల్‌గా మారిన సమంత పోస్టు
Venkatesh: నిన్ను నమ్మిన వాళ్లను ఎప్పుడు మోసం చేయోద్దు.. వెంకటేష్ పోస్ట్ వైరల్
ఇక జరిగింది చాలు.. వైరల్‌గా మారిన సమంత ఇన్స్టాగ్రామ్ పోస్టు
Samantha | సమంత చేసిన పనికి అంతా షాక్.. గే పెళ్లికి సపోర్ట్..