అక్కినేని కోడలు సమంత పేరు గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా ఈ అమ్మడి ప్రవర్తన, సోషల్ మీడియాలో చేసే కొన్ని పోస్ట్‌లు, చైతూతో డైవర్స్‌పై అనేక వార్తలు వస్తున్నా కూడా ఏ మాత్రం స్పందించకుండా సైలెంట్‌గా ఉండడం వంటి విషయాలు సమంత పేరుని హెడ్ లైన్స్‌లో ఉండేలా చేస్తున్నాయి.
సమంత మొదలు పెట్టిన దుస్తుల బ్రాండ్ సాకి ఏడాది పూర్తి చేసుకు్నన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. చైతూతో విడిపోతున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఓ నెటిజన్, మీరు ముంబయికి షిఫ్ట్ అవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇందులో నిజమెంతా అని ప్రశ్నించారు. దీనిపై సమంత స్పందించింది. ఈ రూమర్స్ ఎలా పుట్టాయో అర్థం కావడం లేదు. వందల కొద్ది వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. కానీ అందులో నిజం లేదు
అని తెలిపింది.
హైదరాబాద్ వదిలి ఎక్కడికి వెళ్లనని చెప్పిన సమంత.. ఈ పుకారు ఎక్కడ మొదలైందో తెలియదు. అన్ని రూమర్స్లానే ఇది కూడా ఒకటి. హైదరాబాద్ నాకు అన్నీ ఇస్తోంది, నేను ఇక్కడే ఉంటాను” అని చెప్పుకొచ్చింది . విడాకులకు సంబంధించి ఆమెని అనేక ప్రశ్నలు అభిమానులు ప్రశ్నించగా, వాటిని స్కిప్ చేస్తూ మరింత సస్పెన్స్ పెంచింది.