అగ్రకథానాయికల మధ్య వృత్తిపరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా మాత్రం అందరూ చాలా సన్నిహితంగా ఉంటారు. వారు ఒకే చోట చేరితే ఆ ఆనందానికి హద్దే ఉండదు. తాజాగా నయనతార, సమంత ఒకే ఫ్రేమ్‌లో దర్శనమిచ్చి అభిమానులకు కనువిందుచేశారు. ప్రస్తుతం వారిద్దరు ‘కాథువాక్కుల రెండు కాదల్’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. బుధవారం కథానాయిక నయనతార పుట్టినరోజు వేడుకలు చిత్రబృందం మధ్య ఘనంగా జరిగాయి. ఇందులో సమంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు హాజరైన ఆమె నయనతారకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నది. ‘ఆమె కలలు కన్నది, ఆమె ధైర్యంగా ఉంది. ఆమె తన ప్రతిభను చూపింది, ఆమె రాజ్యం ఏలుతోంది. పుట్టినరోజు శుభాకాంక్షలు నయన్’ అంటూ సమంత ట్విట్టర్లో పేర్కొన్నది. సమంత, నయనతార కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.