‘కంచె’ సినిమాతో తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపును సంపాదించుకుంది ప్రగ్యాజైస్వాల్. ఇటీవల విడుదలైన ‘అఖండ’ చిత్రంలో ఆమె పోషించిన పాత్ర అందరిని ఆకట్టుకుంటున్నది. ‘అఖండ’ సినిమా ద్వారా తెలుగులో భారీ విజయాన్ని దక్కించుకున్న ఈ భామ హిందీలో కూడా హల్చల్ చేస్తున్నది. అగ్రహీరో సల్మాన్‌ఖాన్ సరసన ‘మై చాలా..’ అంటూ ఓ ప్రైవేట్ వీడియో గీతంలో ఆడిపాడింది. ఈ పాట గురించి ప్రగ్యాజైస్వాల్ మాట్లాడుతూ ‘సల్మాన్‌ఖాన్‌తో పనిచేయాలని ప్రతి కథానాయిక కోరుకుంటుంది. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు కన్న కల ఇప్పుడు నిజమవుతున్నది. హిందీలో నా తొలి ప్రాజెక్ట్ సల్మాన్‌ఖాన్‌తో చేయడం ఆనందంగా ఉంది. అసలు ఆయనతో స్టెప్పులేసింది నేనేనా అని ఓసారి గిల్లి చూసుకున్నా (నవ్వుతూ). ఈ పాటతో నా చిరకాలస్వప్నం సాకారమైంది. ఈ గీతాన్ని గురురంధ్వ, లులియా వంతూర్ అద్భుతంగా ఆలపించారు. ఈ పాట ప్రతి ఒక్కరికి నచ్చుతుంది’ అని చెప్పింది.