రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే మైసూర్లో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. రామ్‌చరణ్ కూడా ఈ షెడ్యూల్లో పాల్గొన్నారు. ఇదిలావుంటే.. ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త బలంగా వినిపిస్తున్నది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్‌ని ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో నటింపజేసేందుకు దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నారట.
కథ, సన్నివేశం బలంగా డిమాండ్ చేయడంవల్లే సల్మాన్‌ని కలవాలనుకుంటున్నారట బుచ్చిబాబు. సల్మాన్, చరణ్‌లకు మంచి అనుబంధం ఉంది. ఆ ఫ్రెండ్షిప్తోనే ఆయన చిరంజీవి ‘గాడ్‌ఫాదర్’లో నటించారు. అలాగే ఈ సినిమాలో కూడా ఆయన తప్పక నటిస్తారని చిత్రబృందం నమ్మకంతో ఉందని తెలుస్తున్నది. ఈ సంక్రాంతిలోగా అధికారిక ప్రకటన రావొచ్చని వినికిడి.