బాలీవుడ్ (Bollywood) నిర్మాత, రచయిత సలీమ్ ఖాన్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చి వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా నిలిచాడు సల్మాన్ ఖాన్ (Salman Khan) . ఈ స్టార్ హీరోకు సంబంధించిన న్యూస్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటాడు సల్మాన్ ఖాన్. అయితే ఇప్పుడు జాకీష్రాఫ్ సతీమణి, నటి, నిర్మాత అయేషా ష్రాఫ్ (ayesha Shroff ) ఓ త్రోబ్యాక్ వీడియో షేర్ చేసి సల్లూభాయ్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఇంతకీ ఆ వీడియో ఏంటనుకుంటున్నారా..? సల్మాన్ ఖాన్ 16 ఏళ్ల ప్రాయంలో సముద్రంలోకి జంప్ (dives into the sea) చేసిన వీడియో. అవును సల్మాన్ ఏంటీ సముద్రంలోకి డైవ్ చేయడమేంటనే కదా మీ డౌటు. ఈ వీడియో 1983 కాలం నాటిది. కంపా కోలా కూల్ డ్రింక్ యాడ్(Campa Cola ad) లో తొలిసారి జాయిన్ అయ్యాడు సల్మాన్ ఖాన్. అండమాన్ దీవుల్లో తీసిన త్రోబ్యాక్ విజువల్స్‌ను షేర్ చేస్తూ..జీవితం సాదాసీదాగా..ఫన్నీగా, సంతోషంగా ఉన్నపుడు…అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది అయేషా ష్రాఫ్.
ఈ వీడియోపై ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు కామెంట్ల వర్షం కురిపించారు. అనిల్ కపూర్ సతీమణి సునీతా కపూర్..ఫ్యాబులస్ అంటూ కామెంట్ పెట్టగా..దిశాపటానీ నువ్వు చాలా క్యూట్‌గా కనిపిస్తున్నావు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇపుడు ఈత్రో బ్యాక్ వీడియో ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. అప్పటి టాప్ మోడల్స్ శిరాజ్ మర్చంట్, సునీల్ నిస్కోల్, వనెస్సా వాజ్, ఆర్తి గుప్తా ఈ యాడ్‌లో సల్మాన్‌తో కలిసి పాల్గొన్నారు.