Rashmika Mandanna | అగ్ర కథానాయిక రష్మిక మందన్నకు చేతినిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మొత్తం ఐదు సినిమాల్లో నటిస్తున్నదీ భామ. అయితే అవన్నీ తుదిదశ చిత్రీకరణకు చేరుకోవడంతో కొత్త సినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నది. తాజాగా రష్మిక మందన్న హిందీలో మరో భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానుంది. సల్మాన్‌ఖాన్‌తో ఇప్పటికే ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్న రష్మిక..ఆయనతో మరో సినిమాకు ఓకే చెప్పింది.
వివరాల్లోకి వెళితే.. షారుఖ్‌ఖాన్ ‘జవాన్’తో హిందీలో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు తమిళ దర్శకుడు అట్లీ. ఈ విజయంతో బాలీవుడ్ అగ్ర హీరోలు ఆయనతో సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సల్మాన్‌ఖాన్‌తో అట్లీ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో రష్మిక మందన్న కథానాయికగా ఖరారైందని ముంబయి మీడియాలో వార్తలొస్తున్నాయి.
సల్మాన్‌ఖాన్‌తో దేశం గర్వించబోయే సినిమా తీయబోతున్నానని ఇటీవల దర్శకుడు అట్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే హైప్ క్రియేట్ అయింది. ఇక సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్న జంటగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సికందర్’ మార్చిలో ప్రేక్షకుల ముందుకురానుంది.