Salaar Trailer | హైప్ ఎక్కించుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్.. మరికాసేపట్లో ‘సలార్’ ట్రైలర్
Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది.
Salaar Trailer | పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న తెలుగు సినిమాల్లో సలార్ (Salaar) ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), ప్రభాస్ (Prabhas) కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన Salaar Part-1 Ceasefire టీజర్ నెట్టింట వైరల్ అవుతూ.. మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతోంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సలార్ ట్రైలర్‌ను డిసెంబర్ 01న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇక ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అంటూ ప్రేక్షకులు వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక కేజీఎఫ్ చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను నీల్ ఎలా చూపించబోతున్నాడు. నీల్ డైరెక్షన్ ప్రభాస్ యాక్షన్ ఎలా ఉంటుందని చూడడం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ ఈరోజు రాత్రి 7 గంటల 19 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్లో డార్క్షేడ్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే స్టన్నింగ్ విజువల్స్ మధ్య సలార్‌గా రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ ఇస్తున్న సన్నివేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ సారి అంతర్జాతీయ మాఫియా చుట్టూ తిరిగే కథాంశంతో సలార్‌ను తెరకెక్కిస్తున్నాడట. అంతేకాదు ఇందులో ఓ ఇంటర్నేషనల్ యాక్టర్ కూడా నటిస్తున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ అండ్ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

