అమృతత్వం
‘కర్మచేత గాని సంతానముచేత గాని, ధనముచేత గాని అమృతత్వం లేదా మోక్షము కలుగదు. ఒక్క త్యాగము చేతనే జనులు మోక్షాన్ని పొందిరి..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. ధనలోభం కలిగిన ఒక పిసినారి వ్యాపారవేత్త ఉదంతం పరిశీలిద్దాం. అందరూ ఆత్మజ్ఞానం అన్నిటికన్నా గొప్పదంటారే! అమృతత్వం దానితోనే వస్తుందంటారే! దాన్ని కూడా సంపాదిస్తే పోలే! అనుకున్నాడు ఒక గొప్ప వ్యాపారి. అందరూ చెబుతుండగా విని మహిమోపేతుడని శిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్లాడు.
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానశుః
(మహానారాయణ ఉపనిషత్తు)
‘కర్మచేత గాని సంతానముచేత గాని, ధనముచేత గాని అమృతత్వం లేదా మోక్షము కలుగదు. ఒక్క త్యాగము చేతనే జనులు మోక్షాన్ని పొందిరి..’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. ధనలోభం కలిగిన ఒక పిసినారి వ్యాపారవేత్త ఉదంతం పరిశీలిద్దాం. అందరూ ఆత్మజ్ఞానం అన్నిటికన్నా గొప్పదంటారే! అమృతత్వం దానితోనే వస్తుందంటారే! దాన్ని కూడా సంపాదిస్తే పోలే! అనుకున్నాడు ఒక గొప్ప వ్యాపారి. అందరూ చెబుతుండగా విని మహిమోపేతుడని శిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్లాడు. ‘బాబా! నాకు పొలాలు తోటలు ఇండ్లు ధనము అన్నీ ఉన్నాయి. ఆత్మజ్ఞానం ఒకటే కావాలి’ అన్నాడు వ్యాపారి. ‘ఐష్టెశ్వర్యాలు కాకుండా ఆత్మజ్ఞానాన్ని కోరుకున్నావు. భేష్! తప్పకుండా ప్రసాదిస్తాను. కాసేపు కూర్చో’ అన్నాడు బాబా. ఓ పిల్లవాడిని పిలిచి ‘మార్వాడి వద్దకు వెళ్లి ఐదు రూపాయలు అప్పు తీసుకురా’ అని పురమాయించాడు.
ఆ కుర్రాడు వెంటనే వెళ్లి వచ్చి మార్వాడి ఇంటికి తాళం ఉన్నది అని చెప్పాడు. బాబా వాడిని మరో ఇద్దరు ముగ్గురి దగ్గరికి కూడా పంపించాడు. పిల్లవాడు ఉట్టిగానే తిరిగి వచ్చాడు. ఎక్కడా అప్పు పుట్టలేదు. వ్యాపారి అక్కడే ఉన్నాడు. ఆయన జేబులో ఐదు రూపాయల నోట్లు ఎన్నో ఉన్నాయి. ఒక్క నోటూ తీయలేదు. పైగా ‘ఆత్మజ్ఞానం ప్రసాదించండి. తొందరగా వెళ్లాలి. అవతల బోలెడన్ని పనులు ఉన్నాయి’ అన్నాడు. కాసేపటికి బాబా ఇలా అన్నాడు ‘నీ దగ్గర లేవని కాదు. ఐదు రూపాయల నోట్ల కట్టనే ఉంది. అందులోంచి ఒక్క ఐదు రూపాయల నోటు తీసి ఇవ్వడానికే నీకు బుద్ధి పుట్టడం లేదే! నీ కండ్ల ముందే పిల్లవాడు ఎక్కడెక్కడికో తిరిగి వస్తున్నాడు. చూస్తూనే ఉన్నావు. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? త్యాగంతోనే అమృతత్వం. త్యాగంతోనే ఆత్మజ్ఞానం వస్తుంది. డబ్బుతో కాదు సుమా!’ అన్నాడు బాబా. అక్కడున్నవారంతా తన వైపే చూస్తుండగా వ్యాపారి సిగ్గుతో తలవంచుకున్నాడు.
– డా॥ వెలుదండ సత్యనారాయణ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

