Salaar Teaser | అనుకున్న సమయానికి టీజర్ రిలీజవుతుందా? లేదా? అన్న టెన్షన్లో చెప్పినట్లుగానే కోడికూత వినకముందే సలార్ ఊచకోతను చూపించి ప్రభాస్ అభిమానులను ఆనందపు అంచుల్లో నిలబెట్టారు సలార్ మేకర్స్. రాత్రి సరిగ్గా నిద్రపట్టక ఉదయం 5 ఎప్పుడవుతుందా అని అలారాలు పెట్టకుని మరీ నిద్రలేచిన డార్లింగ్ ఫ్యాన్స్‌ను, సినీ లవర్స్‌ను సలార్ టీజర్ పూర్తిగా సంతృప్తినిచ్చింది. అయితే ప్రభాస్ ఫేస్‌ను పూర్తిగా చూపించుంటే అభిమానులు జోష్ మరోలా ఉండేదని పలువురు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా టీజర్ మాత్రం వేరే లెవల్లో ఉంది. జురాసిక్ పార్కులో డైనోసర్ ముందు ఏదైనా దిగదుడుపే అనే తరహాలో ప్రభాస్‌కు ఎలివేషన్ ఇవ్వడం గూస్బంప్స్ తెప్పించింది.
ఇదిలా ఉంటే సలార్ టీజర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇరవై నాలుగు గంటల్లో 83 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అత్యధిక వ్యూస్ సాధించిన టీజర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాకుండా 1.67 మిలయన్ల లైక్స్‌తో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఓ వైపు వరుస పరజాయాలు చుట్టు ముడుతున్నా.. ప్రభాస్ క్రేజ్ మాత్రం ఇసుమంత తగ్గలేదని టీజర్ రికార్డులతోనే అర్థమయిపోతుంది. ఎంత ప్రశాంత్ నీల్ బ్రాండ్ నేమ్ కనిపించిన.. ప్రభాస్ క్రేజ్ లేకపోతే ఆ స్థాయిలో వ్యూస్ మాత్రం ఖచ్చితంగా వచ్చుండేవి కాదు. గత ఇరవై నాలుగంటలు ఏ సోషల్ మీడియా ప్లాట్ చూసిన సలార్ పేరే కనిపించింది.
టీజర్‌తో సలార్ సినిమాపై అందరిలోనూ అంచనాలు రెట్టింపయ్యాయి. విజువల్స్ పరంగా చూసుకుంటే కేజీఎఫ్ చాయలు కనిపిస్తున్నా.. యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఒకరకమైన ఇంటెన్సిటీ చూపించి సలార్‌లో అంతకు మించి ఏదో ఉందని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశాడు. ఎప్పటిలానే రవి బస్రూర్ తన స్టైల్ ఆఫ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఇరగదీశాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను హోంబలే బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్యాచ్ వర్క్‌ను పూర్తి చేసుకుంటుంది.
The Dinosaur takes over @YouTubeIndia by storm ❤️🔥#SalaarTeaser hits a whooping 83 Million+ Views in 24 Hours!
▶️ https://t.co/KbTyFGPYCu#SalaarCeaseFire #Salaar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms #VijayKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/EXJv2YLqqV
— Hombale Films (@hombalefilms) July 7, 2023