Salaar Second Single | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతోపాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సలార్’. ఈ చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్లు ఇస్తూ.. ఫ్యాన్స్‌ను ఊపిరాడకుండా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ సెకండ్ సింగిల్ విడుదల చేశారు.
సలార్ నుంచి తాజాగా ‘ప్రతి గాథ'(Parthigadalo)లో అనే రెండో సింగిల్‌ను మేకర్స్ వదిలారు. ”ప్రతి గాథలో రాక్షసుడే హింసలు పెడతాడు.. అణచవనే పుడతాడు రాజే ఒకడు. శత్రువునే కడతేర్చే పనిలో మన రాజు అంటూ”.. ఈ పాట సాగింది. మొదటి పాట సూరిడే గొడుగు పట్టి (Sooride) లాగే ఈ పాట కూడా ప్రభాస్‌కు ఎలివేషన్స్ ఇస్తూ ఒకవైపు పవర్‌ఫుల్‌గా.. ఇంకోవైపు ఎమోషనల్‌గా సాగింది. ఈ పాటను చిన్నారుల బృందం అలపించగా.. కృష్ణ కాంత్ లిరిక్స్, రవి బసుర్ సంగీతం అందించాడు.