Salaar Movie Teaser | అప్పుడొస్తుంది.. ఇప్పుడొస్తుందంటూ ఏడెనిమిది నెలల నుంచే సలార్ టీజర్‌పై బోలెడన్ని వార్తలు వస్తున్నాయి. సలార్ షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం రెండు, మూడు పోస్టర్లు తప్పితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి గ్లింప్స్‌లు గట్రా విడుదల కాలేవు. పైగా ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ ఫలితంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. బాహుబలి సీక్వెల్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాపులు రావడంతో ప్రభాస్ అభిమానుల బాధ అంతా ఇంతా కాదు. తొలి మూడు రోజుల్లో్ మూడొందల కోట్లుకు పైగా కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తర్వాత రెండు రోజుల్లో యాభై కోట్లు కూడా వసూల్ చేయలేదు.
దాంతో ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఆశలన్నీ సలార్ సినిమాపైనే ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. కేజీఎఫ్ వంటి వెయ్యికోట్ల సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నుంచి వస్తున్న సినిమా కావడవంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌కు డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సలార్ టీజర్‌ను జూలై 6న ఉదయం 5:12 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/Sg2BuxBKNA #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/pMGQZ49eQh
— Salaar (@SalaarTheSaga) July 3, 2023
హోంబలే బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమార్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు.