Salaar | పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం సలార్ (Salaar). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీని కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్ట్ చేస్తున్నాడు. సలార్ రెండు పార్టులుగా వస్తుండగా.. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 – Ceasefire) డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రశాంత్ నీల్ గతంలో తెరకెక్కించిన ఉగ్రం సినిమాకు సలార్ రీమేక్ అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పుకార్లు నిజమయ్యాయి. ఈ విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీలే ప్రకటించాడు.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీల్ సలార్ (Salaar) కథ ఉగ్రం సినిమా బేస్ చేసుకుని రాసింది అని చెప్పుకోచ్చాడు. ఉగ్రం సినిమాను భారీ ఎత్తున ఆడియన్స్ నడుమ థియేటర్స్ లో చూడాలని అనుకున్నాను, కానీ 2014 టైంలో సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అనుకున్నంత హిట్ అవ్వలేదు. చాలా పెద్ద రేంజ్లో ఊహించా. ఉగ్రం కథకి చాలా పెద్ద స్కోప్ ఉంది. కేజీఎఫ్ రేంజ్ కథ అది. అందులో చెప్పలేకపోయినా పాయింట్స్‌ను సలార్ (Salaar) రూపంలో తీసాను. అందుకే సలార్ సినిమా కథ ఉగ్రంని పోలి ఉంటుంది అంటూ నీల్ వెల్లడించారు.