Salaar Movie | ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఎగ్జైట్ చేస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి గ్లింప్స్ గానీ, టీజర్ గానీ రిలీజ్ చేయకుండానే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రశాంత్‌నీల్, ప్రభాస్‌ను ఏ విధంగా చూపిస్తాడో అని అందరిలోనూ క్యూరియాసిటీ మొదలైంది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటి నుంచే ప్రమోషన్లు షురూ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.
బ్యాలెన్స్ షూట్‌ను కంప్లీట్ చేసి ప్రమోషన్లకు సిద్ధం కానున్నారట. ఇప్పటికే సలార్ టీజర్‌ను కూడా కట్ చేశారట. అయితే ఆదిపురుష్ రిలీజయ్యాకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు మొదలు పెట్టాలని చిత్రబృందంలో ప్రభాస్ అన్నాడట. ఈ క్రమంలో ఆదిపురుష్ రిలీజైన వారం తర్వాత సలార్ టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సింది.
ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటి వరకు రిలీజైన పోస్టర్లు, టీజర్లకు మిశ్రమ స్పందన వచ్చింది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రభాస్‌కు జోడీగా కృతి సనన్ నటించింది. దీనితో పాటుగా ప్రాజెక్ట్-కే ను కూడా రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నాడు ప్రభాస్.