Salaar Movie | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సలార్’. గత ఏడాది డిసెండర్ 22న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. 2023కు సంబంధించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తొలిరోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది సలార్. ఇక ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ఆరు సేతులున్నా సాంగ్‌ను విడుదల చేశారు.
”ఆరు సేతులున్నా గాని ఆదుకొను సెయ్యి రాదమ్మా యా.. యా.. యా.. యా గుక్కపెట్టి రంది ఉంటే ఎడ జాడ కానరావమ్మ యా.. యా.. యా.. యా బక్క పల్చ పంటలమ్మిన భగ్గుమంటూ కోపం ఎందమ్మా యా.. యా.. యా.. యా ఎక్కనెక్కి మొక్కుదామన్న సత్తువ ఇంక లేనే లేదమ్మా” అంటూ ఈ పాట సాగింది. ఇక ఈ పాట చూస్తే.. ఖాన్సర్లో చిన్న పిల్లలని కూడా చూడకుండా.. విలన్స్.. ఆడపిల్లలను అత్యాచారం చేస్తుంటే.. అక్కడ ఉన్నవారందరూ.. కాటేరమ్మ దైవం వస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో ఈ పాట వస్తుంది. ఈ సాంగ్ కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. కనకవ్వ ఆలపించింది.