Rinku Rajguru | 2016లో మరాఠీలో వచ్చి బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మారిన సినిమా సైరట్ (Sairat). 16 ఏండ్ల వయస్సులోనే లీడ్ హీరోయిన్గా మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ కోట్లాదిమంది ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది రింకు రాజ్‌గురు (Rinku Rajguru). ఈ సినిమాతో ఎంట్రీలోనే నేషనల్ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. ఈ భామ టాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హల్ చల్ చేస్తోంది.
రింకు రాజ్‌గురు తాజా టాక్ ప్రకారం హోంబ్యానర్ Crazy Ants Productionsలో రాకేశ్ వర్రే నటిస్తోన్న సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇందులో రింకు రాజ్‌గురును హీరోయిన్గా ఫైనల్ చేశారని టాక్ నడుస్తోంది. విశ్వక్సేన్తో వెళ్లిపోమాకే సినిమా తెరకెక్కించిన యాకుబ్ అలీ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రానున్న రోజుల్లో రింకు రాజ్‌గురు తెలుగు సినిమాపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి మరి.
సైరట్లో వచ్చే జింగాట్ సాంగ్ ఏ రేంజ్లో ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ పాట యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో 400 మిలియన్లకుపైగా వ్యూస్‌తో మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
జింగాట్ సాంగ్..