143 సినిమాతో హీరోగా సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు సాయిరాంశంకర్ (Sairaam Shankar). పూరీ జగన్నాథ్ సోదరుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సాయిరాం శంకర్ హీరోగా పలు సినిమాలు చేశాడు. 2018లో చివరిసారిగా జగదాంబ సినిమాతో ప్రేక్షకులను పలుకరించాడు. ఈ యాక్టర్ నాలుగేళ్ల విరామం తర్వాత మూడు సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయాడు. ఈ మూడు చిత్రాల్లో ఒకటి వెయ్ దరువెయ్ (VeyiDharuveyi).
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ లుక్ ఒకటి అందరితో పంచుకుంది సాయిరాంశంకర్ టీం. వెయిదరువెయ్కు మీ ఆశీస్సులు, ప్రేమ కావాలని ట్వీట్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో యశ శివకుమార్ హీరోయిన్గా నటిస్తోంది. హీరోహీరోయిన్లు రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని నవీన్‌రెడ్డి కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. దేవరాజ్ పోతూరు నిర్మిస్తున్నారు. వెయ్దరువెయ్ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
2009లో వచ్చిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ బంపర్ ఆఫర్‌కు సీక్వెల్ బంపర్ ఆఫర్ 2లో నటిస్తున్నాడు. దీంతోపాటు ఒక పథకం ప్రకారం సినిమాలో కూడా నటిస్తున్నాడు. మూడు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
సాయిరాంశంకర్ వెయిదరువెయ్ మూవీ లుక్..
#Happychirstmas 💫 🧑🎄#VeyiDharuveyi 🔥 👇 All you need is love @sairaamshankar @YashaShivakumar@dirnaveenreddy @actordevaraj@Bheems1 @Moviepromotion5@LyricsShyam @bhaskarabhatla pic.twitter.com/triOyrXh4Y
— BA Raju's Team (@baraju_SuperHit) December 25, 2022