Saindhav Movie | విక్టరీ వెంకటేష్ 75వ మైలురాయికి చేరుకున్నాడు. హిట్ సిరీస్‌తో క్రైమ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సైలేష్ కొలను దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 75వ సినిమా చేస్తున్నాడు. సైంధవ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్ వీక్‌ను లాక్ చేసుకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ గట్రా సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. పైగా చాలా కాలం తర్వాత వెంకీ నుంచి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులలో సైతం తీవ్ర ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సరికొత్త యాక్షన్ ఎపిసోడ్లను రూపొందించే పనిలో పడ్డారట చిత్రబృందం.
ఇక ఇటీవలే ఈ సినిమా యూనిట్ శ్రీలంకకు బయల్దేరింది. శ్రీలంకలో ఓ భారీ షెడ్యూన్‌ను ప్లాన్ చేశారట. కాగా తాజాగా షెడ్యూల్ ప్రారంభమైంది. ఇందులో భారీ యాక్షన్ సన్నివేషాలతో పాటు కొంత టాకీ పార్టును కూడా చిత్రీకరించనున్నారట. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో బ్లాక్ మేజిక్ కీలక పాత్ర పోషించనుందట. ఇదే కాన్సెప్ట్‌కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి ఆసక్తికర కథగా సైలేష్ ఈ చిత్రాన్ని మలిచాడని తెలుస్తుంది.
హిట్ సిరీస్‌తో థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు పొందిన సైలేష్.. ఈ సినిమాతో అసలు సిసలైన థ్రిల్లర్ అంటే ఏంటో చూపించబోతున్నాడట. ముఖ్యంగా జంప్ స్కేర్ సీన్స్ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్ రూపొందిస్తుంది.