ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్‌గా మారిపోవడం వెంకటేశ్‌కి కెమెరాతో పెట్టిన విద్య. ఎటువంటి ఎమోషన్ని అయినా అద్భుతంగా పలికించగల నటుడు వెంకటేశ్. అందులో రెండోమాట లేదు. ఆయన కామెడీ చేస్తే అది కామెడీ సినిమా. ట్రాజెడీ చేస్తే అది ట్రాజెడీ సినిమా. విలన్లను చడుగుడు అడితే అది యాక్షన్ సినిమా. వెంకటేశ్ ఫలానా తరహా హీరో అని చెప్పటానికి లేదు. ఆయన ఆల్‌రౌండర్. చాలాకాలం విరామం తర్వాత ఆయన చేస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ ‘సైంధవ్’. శైలేష్ కొలను దర్శకుడు. వెంకట్ బోయనపల్లి నిర్మాత. సంక్రాంతికి విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంబంధించిన తొలిపాటను ఈ నెల 21న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన సాంగ్ పోస్టర్లో వెంకటేశ్ కొత్త అవతారానికి మంచి స్పందన వస్తున్నదని, ఇటీవల విడుదల చేసిన టీజర్‌కి కూడా మంచి ఆదరణ లభిస్తున్నదని, సినిమా వెంకటేశ్ కెరీర్లోనే బెస్ట్ యాక్షన్ మూవీ అవుతుందని శైలేష్ కొలను అన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.మణికందన్, సంగీతం: సంతోశ్ నారాయణన్.