Actor Nani | ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’(Court: State vs A Nobody) సినిమా నచ్చకపోతే నా హిట్ 3 సినిమాకు రాకండంటూ స్టార్ హీరో నాని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆసక్తికర పోస్ట్ పెట్టాడు హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను.
అగ్ర కథానాయకుడు నాని సమర్పణలో వచ్చిన తాజా చిత్రం ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ (Court: State vs A Nobody). ఈ సినిమాకు రామ్ జగదీశ్ దర్శకత్వం వహించగా.. హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్, రోహిణి, హర్ష వర్ధన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. యదార్థ సంఘటనల ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం పెయిడ్ ప్రీమియర్స్‌ని ప్రదర్శించగా.. ఈ షోలు మంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకున్నాయి. అయితే కోర్ట్ సినిమా హిట్టవ్వడంతో తన సినిమా సేఫ్ అంటూ పోస్ట్ పెట్టాడు హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను.
నా సినిమా హిట్ 3 సేఫ్. కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే చిత్రం భావోద్వేగంతో కూడిన ఒక అద్భుతమైన సినిమా. ఇది తప్పకుండా నచ్చుతుంది. అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధించినందుకు చిత్రబృందానికి అభినందనలు. ప్రియదర్శి కెరీర్లో మరో మైలురాయి చిత్రం. ఇక నా సినిమా పనులు చూసుకోవడానికి ఎడిట్ రూమ్‌కి వెళుతున్నా. దయచేసి అందరు కోర్ట్ సినిమా చూడండంటూ శైలేష్ రాసుకోచ్చాడు. దీనికి ప్రభాస్ మిర్చి సినిమాలోని నా ఫ్యామిలీ సేఫ్ అనే మీమ్ టెంప్లెట్‌ను జోడించాడు.
Naaa cinema safe !!!! #CourtStateVsANobody is an emotionally riveting movie that is absolutely necessary for everyone cos there is so much to take back home. So proud to be associated with @walpostercinema @tprashantii and my man @NameisNani. One more feather in… pic.twitter.com/e13JAGLEJa
— Sailesh Kolanu (@KolanuSailesh) March 12, 2025