కార్తీక్‌రాజు, త్వరిత నగర్ జంటగా అజీమ్రామ్ దర్శకత్వంలో దండమూడి అవనింద్రకుమార్ నిర్మిస్తున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ముహుర్తపు సన్నివేశానికి నేపథ్యగాయకుడు మనో కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అవనింద్రకుమార్ క్లాప్ కొట్టారు. పాటల రచయిత భాస్కరభట్ల స్క్రిప్ట్‌ను అందించారు. నిర్మాత మాట్లాడుతూ ‘హైదరాబాద్, బ్యాంకాక్, పుకెట్లలో చిత్రీకరణ చేస్తాం. 40రోజుల్లో చిత్రాన్ని పూర్తిచేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.
హీరో కార్తీక్‌రాజు మాట్లాడుతూ ‘నిజజీవిత ఘటనల ఆధారంగా రూపొందుతున్న లవ్, యాక్షన్ క్రైమ్ డ్రామా ఇది. డిఫరెంట్ కథతో రానున్న ఈ చిత్రం హీరోగా నాకు గుర్తింపునిస్తుందనే నమ్మకం వుంది’ అన్నారు. నందినిరాయ్, భద్రం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనుదీప్ దేవ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గొట్టిపాటి సాయి (సాయి స్రవంతి మూవీస్).