OTT Movies | సినీ అభిమానులకు ఈ వారం డబుల్ ధమాకా సిద్ధమైంది. ఒకవైపు థియేటర్లలో భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. జూన్ 29 నుంచి జూలై 5 వరకు విడుదల కానున్న థియేట్రికల్, ఓటీటీ కంటెంట్ ఏంటో చూద్దాం.
జూలై 3న పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ చిత్రం మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. అదే రోజు సత్యదేవ్, దర్శకుడు వెంకటేశ్ మహా కాంబినేషన్లో రూపొందిన సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ‘రావు బహదూర్’* కూడా విడుదల కానుంది. బాలీవుడ్ నుంచి ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ జూలై 3న థియేటర్లలోకి రానుండగా, హుమా ఖురేషి ప్రధాన పాత్రలో రూపొందిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘బేబీ డూ డై డూ’ కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు యానిమేటెడ్ కామెడీ చిత్రం ‘మినియన్స్ అండ్ మాన్స్టర్స్’ జూలై 1న విడుదల కానుంది.
బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లోని స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన సోషల్ డ్రామా ‘హ్యాంగ్ మ్యాన్’ జూలై 3 నుంచి సన్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ కానుంది. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ జూన్ 30 నుంచి యాపిల్ టీవీలో రెంటల్ విధానంలో అందుబాటులోకి రానుంది. సందీప్ కిషన్ తొలి ఓటీటీ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ జూలై 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
* ఎల్లే (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 1
* ఇసకపట్నం (తెలుగు సిరీస్) – జూలై 2
* అబ్సెషన్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 30
నెట్‌ఫ్లిక్స్‌లో
* పెద్ది (తెలుగు మూవీ – ప్రచారంలో ఉన్న తేదీ) – జూలై 2
* ఎనోలా హోమ్స్ సీజన్ 3 – జూలై 2
* సూపర్ సుబ్బు – జూలై 2
* హ్యూమన్ వెపర్ – జూలై 2
* స్పార్క్స్ ఆఫ్ టుమారో (జపనీస్ సిరీస్) – జూలై 5
జియో హాట్‌స్టార్‌లో
* మాలీవుడ్ టైమ్స్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – జూలై 3
* ప్రీతమ్ అండ్ పెడ్రో (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 3
జీ5లో
* మర్మదేశం (తెలుగు సిరీస్) – జూలై 3
* ముతస్సీ (మలయాళ హారర్ థ్రిల్లర్ సిరీస్) – జూలై 3
సన్ నెక్స్ట్ లో
* హ్యాంగ్ మ్యాన్ (తెలుగు సినిమా) – జూలై 3
యాపిల్ టీవీ ప్లస్ లో
* సిలో సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 3
ఆహాలో
* టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ (రియాలిటీ షో) – జూలై 3
మొత్తంగా ఈ వారం థియేటర్లలో భారీ సినిమాలు, ఓటీటీల్లో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్లర్, మైథలాజికల్, కామెడీ, హారర్, డ్రామా… ఇలా అన్ని జానర్లలో వినోదం అందుబాటులో ఉండటంతో సినీ అభిమానులకు ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీక్‌గా మారనుంది.