సాయిరోనక్, అమృత చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘రివైండ్’. స్వీయ దర్శకనిర్మాణంలో కల్యాణ్ చక్రవర్తి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘టైం ట్రావెల్ మీద తీసిన లవ్‌స్టోరీ ఇది. సైంటిఫిక్ ఫిక్షన్ జోనర్లో ఆకట్టుకుంటుంది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. విభ్నిన ఇతివృత్తంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుంది’ అన్నారు. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా తప్పకుండా కొత్త ఫీల్‌నిస్తుందని హీరో సాయిరోనక్ చెప్పారు. సురేష్, జబర్దస్త్ నాగి, కేఏ పాల్రామ్, అభిషేక్, ఫన్ బకెట్ రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్, సంగీతం: ఆశీర్వాద్, నిర్మాణం: క్రాస్ వైర్ క్రియేషన్స్, నిర్మాత, దర్శకత్వం: కల్యాణ్ చక్రవర్తి.