మహిళా ప్రధాన కథకు గ్రీన్‌సిగ్నల్?
కథ, పాత్ర సరిగ్గా లేకపోతే సినిమా అంగీకరించరు సాయిపల్లవి. సాధ్యమైనంత వరకూ ఆమె నటించే సినిమాల్లో బలమైన కథలే ఉంటాయి. పాత్రలు కూడా బరువుగానే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’లో సీతాగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే.
కథ, పాత్ర సరిగ్గా లేకపోతే సినిమా అంగీకరించరు సాయిపల్లవి. సాధ్యమైనంత వరకూ ఆమె నటించే సినిమాల్లో బలమైన కథలే ఉంటాయి. పాత్రలు కూడా బరువుగానే ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ పాన్ ఇండియా మూవీ ‘రామాయణ’లో సీతాగా సాయిపల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే మణిరత్నం సినిమాకు కూడా ఈ అందాలభామ ఓకే చెప్పింది. కాకపోతే ‘తండేల్’ తర్వాత తెలుగులో ఏ కథనూ సాయిపల్లవి ఓకే చెయ్యలేదు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు తిరుమల కిశోర్ ఇటీవలే సాయిపల్లవికి ఓ కథ వినిపించారట. మహిళా ప్రధానంగా సాగే ఈ కథలో.. దైవిక శక్తులు, పురాణాల టచ్ కూడా ఉందట. కథలోని భావోద్వేగాలు, పాత్ర ప్రాధాన్యత సాయిపల్లవిని ఆకట్టుకున్నాయని, ఈ ప్రాజెక్ట్‌పై ఆమె సానుకూలంగానే స్పందించినట్టు తెలుస్తున్నది. ఇక దీనిపై సాయిపల్లవి నుంచి అధికారికంగా గ్రీన్‌సిగ్నల్ వస్తే, ఇతర నటీనటులు, నిర్మాతల వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

