Sai Pallavi Sandalwood Debut| శాండల్ వుడ్ పై కన్నేసిన సాయిపల్లవి
'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది మంగళూరు భామ సాయిపల్లవి (Sai Pallavi) . తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లలో ఫాలోవర్లను సంపాదించుకుంది.

‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది మంగళూరు భామ సాయిపల్లవి (Sai Pallavi) . తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ కోట్లలో ఫాలోవర్లను సంపాదించుకుంది. గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేసే ఈ బ్యూటీ మరో ముందడుగు వేస్తోంది. సాయిపల్లవి ఇక నుంచి శాండల్ వుడ్ (Sandalwood) ప్రేక్షకులను కూడా అలరించేందుకు రెడీ అయింది.
నేషనల్ అవార్డు విన్నింగ్ కన్నడ డైరెక్టర్ మన్సోర్ (Mansore) ఇటీవలే తన సినిమాలో కీ రోల్ కోసం సాయిపల్లవిని సంప్రదించాడట. సాయిపల్లవికి ఫోన్ చేసి పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న చిత్రంలో లీడ్ రోల్ ఆఫర్ చేసినట్టు కోలీవుడ్ లో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. మన్సోర్ చెప్పిన కథ, కథనం నచ్చిన సాయిపల్లవి..స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలని డైరెక్టర్ మన్సోర్ కు సూచించినట్టు టాక్. మన్సోర్ డైరెక్టర్ చేసిన యాక్ట్ 1978 (Act 1978) బాక్సాపీస్ వద్ద మంచి హిట్ గా నిలిచింది.
ఆగస్టు 15న మన్సోర్ పెళ్లిపీలెక్కాడు. అయితే సినిమా కథను త్వరగా సిద్దం చేసేందుకు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను దూరం పెట్టాడు మన్సోర్. ఈ చిత్రాన్ని నాలుగు దక్షిణాది భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట మన్సోర్. ఇక సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్య తో కలిసి లవ్ స్టోరీ సినిమా చేయగా..సెప్టెంబర్ 10న విడుదల కానుంది. మరోవైపు రానాతో విరాటపర్వం సినిమా చేస్తోంది. విడుదల తేదీపై త్వరలో క్లారిటీ రానుంది.
ఇవికూడా చదవండి..
Regina Cassandra| అస్థిపంజరాన్ని పరీక్షిస్తున్న రెజీనా
Samantha Akkineni | పాండిచ్చేరికి సమంత పయనం..!
Vaishnav Tej | క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా విడుదల తేదీ ఫిక్స్..!
Sunitha | డబ్బు కోసం రామ్‌ను పెళ్లి చేసుకున్నానంటున్నారు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

