Love story | మహేశ్ బాబుకు సాయి పల్లవి సర్ప్రైజ్ !

Love story | నాగ చైతన్య ( Naga chaitanya ), సాయి పల్లవి ( sai pallavi ) జంటగా శేఖర్ కమ్ముల ( sekhar kammula ) తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమా బాక్సాఫీసు దగ్గర దూసుకెళ్తోంది. మంచి కాన్సెప్ట్ మెసేజ్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర ఘన విజయాన్ని అందుకుంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సాయి పల్లవి ఎప్పటిలాగే తన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా సారంగ దరియా పాటలో తన స్టెప్పులను కుర్రకారు మతి పోగొట్టింది. ఇక నాగ చైతన్య కూడా తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చాడు అనడంలో సందేహమే లేదు. అందుకే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే లవ్ స్టోరీ సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
సెప్టెంబర్ 24న విడుదలైన లవ్ స్టోరీ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 22 శుక్రవారం సాయంత్రం ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయం తెలిసినప్పటికీ లవ్ స్టోరీ సినిమాను థియేటర్లో చూసేందుకే చాలామంది ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. అందుకే ఇప్పటికీ ఈ సినిమాకు బుకింగ్స్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కేవలం ఒక్క థియేటర్లోనే కోటి రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రం. సూపర్ స్టార్ మహేశ్ బాబు ( super star mahesh babu )కి చెందిన ఏఎంబీ సినిమాస్ ( AMB cinemas) మల్టీప్లెక్స్‌లో సెకండ్ వేవ్ తర్వాత కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన తొలి చిత్రంగా లవ్ స్టోరీ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ మల్టీప్లెక్స్‌లో 251 షోలు నిర్వహించగా.. 48,233 మంది ఈ చిత్రాన్ని వీక్షించారు. ఏఎంబీ మల్టీప్లెక్స్‌లో కోటి రూపాయల వసూళ్లు సాధించిన చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్పొచ్చు. స్టార్ హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే కలెక్షన్లను సాయి పల్లవి లవ్ స్టోరీ చిత్రం రాబట్టడం నిజంగా విశేషమే !
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Naga Chaitanya: ముద్దు సీన్ కోసం నాగ చైతన్య అంత సమయం తీసుకున్నాడా..!
Sai Pallavi | ఆ ముద్దు సన్నివేశం గురించి సాయిపల్లవి ఏమన్నదంటే..?
sai pallavi | సాయిపల్లవిలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందబ్బా..
Sai Pallavi | తెలంగాణలో స్థిరపడాలనుంది
Sai Pallavi Sandalwood Debut| శాండల్ వుడ్ పై కన్నేసిన సాయిపల్లవి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

